పాక్‌: ఇమ్రాన్‌ అల్లర్లు.. రూ.20 లక్షల కోట్ల నష్టం?

Chakravarthi Kalyan
ఇప్పటివరకు భారతదేశం చెయ్యని పనిని పాకిస్తాన్ మాజీ మంత్రి ఇమ్రాన్ ఖాన్ చేశాడని అంటున్నారు. అంటే అదేదో గొప్ప విషయం కాదు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన మనుషులు జరిపిన అల్లర్లతో వేల కోట్లలో నష్టం వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనితో పాకిస్తాన్ అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తులు ఇమ్రాన్ ఖాన్ మనుషుల నుండి రక్షించమని కోరుతూ ఉద్యమాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

భారత్ లో అధికార పక్షం నుండి దేశం రక్షించబడాలని విపక్షాలు చేసినటువంటి జోడోయాత్ర లాగా అదే ఆ తరహాలో పాకిస్తాన్ లో కూడా ఉద్యమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. తాజాగా పాకిస్తాన్ అధికార పక్షం సుప్రీంకోర్టు బారి నుండి, ఇమ్రాన్ ఖాన్ బారి నుండి  కూడా రక్షించమని ఉద్యమాలు చేస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ లో. పాకిస్తాన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటిదగ్గర, ఇంకా సుప్రీంకోర్టు బయట కూడా వీళ్లు ఉద్యమాలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

మరో రెండు నెలల్లో పాకిస్తాన్ లో ప్రధాన ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈ లోగా కైబర్ ఫక్తూనా పంజాబ్ ప్రావిన్స్ లలో ఎన్నికలు జరపమని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇంకేముంది భారత్ తో యుద్ధం జరగబోతుంది అన్నట్లుగా అక్కడ ప్రభుత్వం చెప్తే ఇలాంటి ఊహాజనిత మాటలు చెప్పవద్దని కోర్టు చెప్పింది. ఈ మే 14 లోపు అక్కడ ఎన్నికలు జరపమని అది ఆదేశించింది. కానీ 13 కాదు కదా 14 వచ్చినా కూడా అక్కడ జరగలేదు.

పైగా కోర్టు బయట దీని మీద ఉద్యమాలు చేస్తుంది అక్కడ ప్రభుత్వం. షాబా షరీఫ్ ప్రభుత్వం వాదన ఏంటంటే గత 75 ఏళ్ల నుండి భారతదేశం పాకిస్తాన్ ను నాశనం చేయాలని చూస్తుంది. కానీ ఇప్పటివరకు భారత్ చేయలేని పనిని ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించిన వ్యక్తులు కొన్ని రోజుల పరిధిలోనే చేసేసారని ఆయన అంటున్నారు.‌ వీళ్ల వల్ల పాకిస్తాన్ కు 20 లక్షల కోట్ల నష్టం జరిగిందని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: