జన్ ధన్ ఖాతాదారులకు కేంద్రం బంపర్ న్యూస్?

Purushottham Vinay
మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. ఇందులో పేదలకు ఆర్థిక సహాయం నుంచి ఉచిత రేషన్ దాకా అనేక రకాల సౌకర్యాలని అందిస్తోంది.అందులో భాగంగా జన్ ధన్ ఖాతా ఉన్న జనాలకి ఇప్పుడు ఒక గొప్ప వార్త రాబోతోంది. జన్ ధన్ ఖాతాదారులకు (ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రూ.10,000 ని అందజేస్తోంది. మన దేశంలోని 47 కోట్ల మందికి పైగా ఖాతాదారులు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు. అయితే మీరు ఖచ్చితంగా ఈ డబ్బు కోసం దరఖాస్తు చేసుకోవాలి.అయితే ప్రభుత్వం ఎవరికి రూ.10 వేలు బహుమతి ఇవ్వనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీకు కూడా జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేసి ఉంటే, మీరు ప్రభుత్వం నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంని ఈజీగా పొందగలరు. ఇంకా ఈ సదుపాయం కింద, మీ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా కూడా మీరు రూ. 10,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంపై ఇంతకుముందు రూ. 5000లు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రభుత్వం ఈ లిమిట్ ని రూ. 10,000కి పెంచింది. ఇందు కోసం మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇక 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.ఈ పథకంలో 60 సంవత్సరాల వయస్సు దాకా డబ్బు పొందే ఛాన్స్ ఉంటుంది.అలాగే ఇందులో సంవత్సరానికి రూ.36,000లును ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు.మీ నెలవారీ ఆదాయం కనుక రూ.15,000ల కంటే తక్కువ ఉంటే మాత్రమే ఈ ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు.అయితే మీరు ఈ ప్రభుత్వ ఖాతాను ప్రైవేట్ లేదా ప్రభుత్వ బ్యాంకులో ఎక్కడైనా కూడా ఓపెన్ చేయవచ్చు. ఇది కాకుండా, మీకు ఇప్పటికే సేవింగ్స్ అకౌంట్ కనుక ఉంటే, మీరు ఆ అకౌంట్ ని జన్ ధన్ అకౌంట్ ని మార్చుకోవచ్చు. ఈ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి మీకు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఖచ్చితంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: