సామాన్యులకు ఉపశమనం.. తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం..?

Purushottham Vinay
ఇక సామాన్యులకు భారీ ఉపశమనం అనేది లభించింది. పోయిన నవంబర్ నెలలో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు అనేది 5.88 శాతానికి తగ్గింది. అక్టోబర్ 2022లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు మొత్తం 6.77 శాతంగా ఉంది.ఇక సంవత్సరం క్రితం నవంబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం మొత్తం 4.91 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీ తగ్గుదల అనేది ఉంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌ నెలలో 4.67 శాతానికి తగ్గగా, అక్టోబర్‌ నెలలో ఆహార ద్రవ్యోల్బణం మొత్తం 7.01 శాతం ఉంది. ఇక అదే సమయంలో, నవంబర్ నెలలో పట్టణ ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది.అలాగే అంతకుముందు నెల ఇది మొత్తం 7.01 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం నాడు కీలక గణాంకాలను రిలీజ్ చేసింది. ఈ ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా కూడా ఆర్‌బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంతమైన స్థాయికి పైనే ఉండడం గమనార్హం.ఇంకా ఈ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు తగ్గడం. ఆహార ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్ 2022లో మొత్తం కూడా 7.01 శాతంగా ఉంది. ఇది నవంబర్‌ నెలలో మొత్తం 4.67 శాతానికి తగ్గింది.


ఇంకా అలాగే మరోవైపు అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చేసి 6.53 శాతం ఉండగా.. నవంబర్‌ నెలలో మాత్రం 3.69 శాతానికి తగ్గింది.ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.30 శాతం ఉండగా.. నవంబర్‌ నెలలో మొత్తం 5.22 శాతానికి తగ్గింది. ఆకుకూరలు ఇంకా కూరగాయల ద్రవ్యోల్బణం మొత్తం -8.08 శాతానికి తగ్గింది. ఇక పండ్ల ద్రవ్యోల్బణం వచ్చేసి 2.62 శాతంగా ఉంది.ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్థాయి కంటే దిగువకు దిగజారడం అతిపెద్ద ఉపశమనం అయ్యింది. ఆర్‌బీఐ 2 నుంచి 6 శాతం ద్రవ్యోల్బణం రేటును సహించమని నిర్ణయించడం జరిగింది.కానీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే కూడా స్థిరంగా ఉంది. ఏప్రిల్‌ నెలలో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు వచ్చేసి మొత్తం 7.79 శాతానికి చేరుకుంది. ఇక ఆ తర్వాత, ఐదు ద్రవ్య విధాన సమావేశాల తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచడం జరిగింది.ఇంకా ఈ రెపో రేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది.ఈ ద్రవ్యోల్బణం తగ్గుతూనే ఉంటే.. Ik1రాబోయే సంవత్సరంలో వడ్డీ రేటు పెంపునకు బ్రేక్ అనేది పడవచ్చు. రెపో రేటు పెంపు ప్రక్రియ కూడా ఆగిపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో పతనం కనుక పెరిగితే వడ్డీ రేట్లు అనేవి కూడా చౌకగా మారవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: