సిబిల్ స్కోర్‌ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి?

Purushottham Vinay
సిబిల్ స్కోర్‌లో మీ ఉద్యోగ వివరాలు, బ్యాంక్ ఖాతాలు ఇంకా అలాగే పాత రుణ వివరాలు వంటి మీ వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ రోజుల్లో ఈ స్కోర్‌ను ఎక్కువగా చూస్తున్నాయి.ఈ సిబిల్ స్కోర్  అనేది 0 నుంచి 900 వరకు ఉంటుంది. సాధారణంగా 700 కంటే ఎక్కువ CIBIL స్కోర్ ని మంచిగా పరిగణిస్తారు. అందువల్ల మీ సిబిల్ స్కోర్‌ని మెరుగుపరచాలనుకుంటే.. దీని కోసం మీరు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించడం చాలా మంచిది.మీరు క్రెడిట్ కార్డ్‌ని వాడుతుంటే , మీరు దాని పూర్తి క్రెడిట్ పరిమితిని వాడకూడదు. మీరు మీ మొత్తం క్రెడిట్ పరిమితిలో 30% కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. దీని కోసం మీరు ఖచ్చితంగా బడ్జెట్‌ను రూపొందించాలి. మీ ఆదాయం ఇంకా అలాగే ఖర్చులను సమతుల్యం చేసుకోవాలి.అలాగే మీరు లోన్ రీపేమెంట్ కోసం ఎక్కువ కాల వ్యవధిని ఎంచుకుంటే, మీరు ఖచ్చితంగా తక్కువ EMIలను చెల్లించాలి.ఇంకా అలాగే, దాని సాధారణ చెల్లింపు మీకు చాలా సులభం అవుతుంది. మీ ఆదాయంలో క్రెడిట్ రీపేమెంట్ వాటా అనేది తక్కువగా ఉంటుంది.ఇక మీ ఆదాయం లోన్ మొత్తం కంటే ఎక్కువ కానట్లయితే, మీరు దీర్ఘకాలిక లోన్ చెల్లింపు ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీ సిబిల్ రేటింగ్‌ను పెంచుకోవచ్చు.


ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం మీ క్రెడిట్ రేటింగ్‌కు చాలా వీక్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఈజీగా తిరిగి చెల్లించగలిగినంత రుణం తీసుకోవాలి. ఎక్కువ రుణాలు తీసుకుంటే వాటి వాయిదాలను సకాలంలో చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఇది మీ CIBIL స్కోర్‌పై ఖచ్చితంగా కూడా చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది.ఇక మీరు ఇప్పటికే లోన్ తీసుకున్నట్లయితే దాని EMIని కరెక్ట్ టైంలో చెల్లించడం ఎల్లప్పుడూ అలవాటు చేసుకోండి. CIBIL స్కోర్‌ని మెరుగుపరచడానికి EMIలను సకాలంలో చెల్లించడం మంచి మార్గం. మీరు దీన్ని చేయకపోతే, మీ CIBIL స్కోర్ ఈజీగా తగ్గుతుంది.భవిష్యత్తులో లోన్ తీసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది.ఇక మీరు కొత్త రుణం తీసుకోబోతున్నట్లయితే, దానికి ముందు ఏదైనా బకాయిలు ఉంటే ఖచ్చితంగా చెల్లించండి. ఎందుకంటే ఇది మీ మొత్తం ఆదాయంలో రుణ చెల్లింపు వాటాను తగ్గిస్తుంది. మీ ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడంలో కనుక ఖర్చు చేస్తుంటే, బ్యాంకు మీకు కొత్త లోన్ ని సులభంగా ఇవ్వడానికి ఇష్టపడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: