ట్రైన్ లో కూడా హోస్టులు.. వాటిలోనే..!

Chandrasekhar Reddy
ఇప్పటి వరకు విమానాలలోనే హోస్టులు ఉండటం చూశాం. వాళ్ళు ప్రయాణికులకు అవసరమైన సూచనలు ఇస్తూ, వారికి కావాల్సిన సేవలు సమయానుకూలంగా అందిస్తూ ఉంటారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందికి గురికాకుండా ఎప్పటికప్పుడు వారికి అవసరమైనవి అందిస్తూ, ఆయా సూచనలు చేస్తూ ఉండటం వీరి బాధ్యతలు. ఎప్పుడు ఉత్సాహంగా, సమయస్ఫూర్తితో ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతా సజావుగా సాగుతున్నప్పుడు ఏమి ఉండదు కానీ, ఎప్పుడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా అందరిలో ఒక రకమైన ఆందోలన తప్పకుండ చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రవర్తిస్తే, అక్కడ ఉన్న వాతావరణం దెబ్బతినే అవకాశాలు ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలోకి సందర్భం వెళ్లకుండా హోస్టులు చాకచక్యంగా వ్యవహరిస్తూ, మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొస్తారు.
అందం, సమయస్ఫూర్తి, ఆకర్షణ, మాటకారితనం, ఎప్పుడు నవ్వుతు ఉండే సహజగుణం లాంటివి హోస్టులలో ఉండాల్సిన గుణాలు. వీరిని నియామకాల సమయంలోనే ఆయా లక్షణాలు ఉన్నది లేనిది పరీక్షించి, విధులలోకి తీసుకుంటారు. దానిని బట్టే అర్ధం అవుతుంది, పరిస్థితి ఏదైనా తమ చేతులోకి తీసుకుని దానిని సాధారణ స్థితిలోకి తీసుకురావాలన్నది వాళ్ళ ప్రాథమిక కర్తవ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు ఇలాంటి నియామకాలు కేవలం ఎయిర్ హోస్టుల కోసమే జరిగేవి. ఇకమీదట కేంద్రప్రభుత్వం రైళ్లలో కూడా ఇలాంటి సేవలను అందించడానికి సిద్ధం అవుతుంది.
ఆ మేరకు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. త్వరలో ఈ నియామకాలను చేపట్టనున్నట్టుగా ప్రకటన లో తెలిపారు. అయితే ఇక్కడ హోస్టులుగా మహిళలు, పురుషులు కూడా నియమించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరు ఎయిర్ హోస్టులు మాదిరిగానే, ప్రయాణికులకు సేవలు అందించడంలోనూ, అలాగే ఇతర సమయాలలో తగిన సూచనలు చేయడం లోను తమ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ సేవలు కొన్ని రైళ్లలోనే ప్రాధమికంగా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ప్రీమియం రైళ్లలో మాత్రమే. ఇప్పటికైతే దేశంలో 12 శతాబ్ది, రెండు వందే భారత్, ఒక గతిమాన్, తేజస్ ఎక్స్ప్రెస్ లు ప్రీమియం రైళ్లుగా ఉన్నాయి. వీటిలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: