ఉగ్రవాదుల అడ్డాలో సంచలన దృశ్యాలు?

Chakravarthi Kalyan
హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. ఇప్పటికే ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు.  జవహార్ నగర్ బాలాజీనగర్ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇస్లామిక్ రాడికల్ సల్మాన్ ఇంటిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలించారు. ఇంటికి నలువైపులా సీసీ కెమెరాలు ఉన్నాయి. లోపలికి ఎవరూ ప్రవేశించకుండా ఇంటికి ఎత్తైన ప్రహరీ గోడలున్నాయని తెలిపారు. ప్రహరీగోడల మీద గాజు పెంకలను సల్మాన్ ఏర్పాటు చేసుకున్నాడని... సల్మాన్ ఇల్లు దాటి కాస్త ముందుకు వెళ్లగానే చెట్లు, ముళ్ల పొదలు, గుట్టలు ఉన్నాయని... స్థానికంగా టీవీ మరమ్మతులు చేసే వ్యక్తిగా చలామణి అవుతున్న సల్మాన్, రోజు ఉదయం బయటికి వెళ్లి, తిరిగి రాత్రికి ఇంటికి వచ్చేవాడని తెలిపారు.

ఈ కాలనీల్లో ఎక్కువగా సల్మాన్ బంధువులే ఉన్నారని.. సల్మాన్ ఇంటి సీసీ ఫుటేజ్ ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని.. సల్మాన్ ఇంట్లో నిన్న పోలీసులు మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఇల్లు కేంద్రంగానే ఏమైనా కుట్రలకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: