ఎర్ర గంగిరెడ్డి చేతిలో అవినాష్‌ రెడ్డి భవితవ్యం?

Chakravarthi Kalyan
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయాడు. ఆయన్ను సీబీఐ అధికారులు చంచల్ గూడ జైలుకు తరలించారు. గంగిరెడ్డికి  కోర్టు వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండ్ విధించింది. సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని పోలీసు వాహనంలో చంచల్ గూడ జైలుకు తరలించారు.

అంతకుముందు ఎర్ర గంగి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు వారి వాదనతో  ఏకీభవించింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గంగి రెడ్డి బయట ఉండటం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతోందని సీబీఐ వాదించింది. ఆయన సాక్షులను బెదిరిస్తున్నాడని సీబీఐ వాదించింది. అయితే వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జూన్ 30 వ తేదీ వరకు గడువు ఉంది. అప్పటి వరకు గంగిరెడ్డి చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటారు. ఆయన చెప్పే వివరణ బట్టే అవినాష్ రెడ్డి భవితవ్యం ఆధాపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: