జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన చెల్లె షర్మిల?

Chakravarthi Kalyan
చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య ఆస్తి కోసం జరగ లేదంటూ చెప్పడం ద్వారా వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్న జగన్‌కు షాక్‌ ఇచ్చారు. తన చిన్నాన్న ఆస్తులను సునీత పేరుమీద ఎప్పడో వీలునామా రాశారని వై.ఎస్.షర్మిల  అంటున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతంపై వై.ఎస్. షర్మిల స్పందించారు. వివేకానంద ప్రజానాయకుడు ప్రజల మనిషి అని.. పులివెందుల, కడప జిల్లా ప్రజలకు వివేకానంద గురుంచి బాగా తెలుసని వై.ఎస్.షర్మిల అన్నారు.

లేని వ్యక్తి మీద ఎందుకు విష ప్రచారం చేస్తున్నారని వై.ఎస్.షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. తన చిన్నాన్న సాధారణ జీవితం గడిపారని.. కొన్ని మీడియాలలో ఆయన గురించి, వ్యక్తిగత జీవితం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారని వై.ఎస్.షర్మిల అన్నారు. వివేకానందరెడ్డి పై వారు చేస్తున్న కామెంట్స్ ను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని వై.ఎస్.షర్మిల అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని వై.ఎస్.షర్మిల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: