హైదరాబాద్‌లో ఆ రెండు విగ్రహాలు మాయం?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయం వద్ద ఉన్న తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలు మాయం అయ్యాయని బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్‌ ఆరోపించారు. తెలుగు ప్రజలంతా అమ్మగా భావించుకునే తెలుగు తల్లి, ఆంధ్రుల ఆశయ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలు నాలుగు రోజులుగా కనిపించడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్‌ అన్నారు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని గాలికొదిలేసి తెలంగాణను దోచుకోవడంలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ను దోచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారని... దోపిడీకి కాస్త బ్రేక్ ఇచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలైన ఆ రెండు విగ్రహాల చోరీపై దృష్టి సారించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్‌ సూచించారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలుగు ప్రజల ఆత్మగౌరవమంటే విలువ లేదని... సాక్షాత్తూ హైదరాబాద్‌లోని కొత్త సచివాలయం ఎదురుగా 4 రోజుల క్రితం వరకు ఈ రెండు విగ్రహాలు ఉండేవని.. కేసీఆర్, కేటీఆర్ దోచుకునే దందాతో పాటు కిడ్నాప్ దందా కూడా మొదలుపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలైన ఆ రెండు విగ్రహాలను కిడ్నాప్ చేశారని సత్యకుమార్‌ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: