రేవంత్‌ రెడ్డికి ఛాన్స్‌.. ఏపీ నుంచి నిల్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి స్టార్‌ క్యాంపెయినర్లుగా నియమితులు అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్‌ అధిష్ఠానం 40మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్లకు ఈ స్టార్‌ క్యాంపెయినర్ల ఈ జాబితాలో స్థానం కల్పించింది.
స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌, సిద్దరామయ్య, రన్‌దీప్‌ సింగ్‌ సుర్జెవాలా, జయరాం రమేష్‌, వీరప్పమొయిలీ, ఎంపీ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, అశోక్‌ గెహ్లాట్‌, భూసేస్‌ భగేల్‌, చిదంబరం, రేవంత్‌ రెడ్డి, మహ్మద్‌ అజారుద్దీన్‌ ఉన్నారు. వీరితో పాటు 40 మంది పేర్లను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ముఖుల్‌ వాస్కీ ఎన్నికల సంఘానికి జాబితా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: