జేఎల్‌, డీఎల్‌ పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్‌ ?

Chakravarthi Kalyan
ప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి లోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు వారు ఆందోళనకు దిగారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డబుల్ పిజి నిబంధన పెట్టి... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో... సింగిల్ పీజీ చేసిన వారికి కూడా అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

కేవలం కోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే మే 17న నిర్వహించే పరీక్ష కు అనుమతి ఇచ్చారని.. దీని కారణంగా కోర్టును ఆశ్రయించని మూడు వేల మంది అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా సింగిల్ పీజీ పై పిఈడీ పోస్టులకు రీ నోటిఫికేషన్ ఇచ్చి అందరికి అవకాశం ఇవ్వాలని కోరారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: