సీక్రెట్‌: మోడీయే కేసీఆర్‌ను రావొద్దని అన్నారా?

Chakravarthi Kalyan
ఇవాళ హైదరాబాద్‌లో జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ముందుగా ప్రొటోకాల్ ను పాటించకుండా అవమానించింది ప్రధాని మోదీనేనని ఆయన అన్నారు. గతంలో కోవిడ్ వేళ ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పడు.. సీఎం వెళ్తానంటే వద్దన్నారని.. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని ఆ రోజు ఎందుకు వద్దన్నారో ఇప్పటి వరకు చెప్పలేదని వినోద్ కుమార్ అన్నారు.

అలాగే సూత్ర ప్రాయంగా అంగీకరించిన 14 జాతీయ రహదారులను ఎందుకు మంజూరు చేయడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. వాటిని ఎందుకు పెండింగులో పెట్టారో రాష్ట్ర పర్యటన సందర్భంగా నరేంద్రమోదీ స్పష్టత ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదో తెలపాలని వినోద్ కుమార్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: