కేసీఆర్‌.. ఇంకెప్పుడు ప్రమోషన్ ఇస్తారు?

Chakravarthi Kalyan
ప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ధర్నా చేసింది. ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్లు  ధర్నా నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం నినాదాలు చేశారు. 8 సంలుగా పదోన్నతులు లేక రిటైర్ అయ్యారని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.

స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అధికంగా ఉండుటం వల్ల... పాఠశాలలో విషయ నిపుణుల కొరత వల్ల విద్యనభ్యసిస్తున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అయోమయంలో పడేస్తుందని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అన్నారు. ప్రభుత్వం మేలుకొని పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ కోరింది. పదోన్నతులు సాధించే వరకు విశ్రమించేది లేదని... పహా వృత్తుల సాధనే ఏకైక ఎజెండాగా పని చేస్తామని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: