చైనాకు ఊహించని షాక్‌ ఇచ్చిన అజిత్‌ దోవల్‌?

Chakravarthi Kalyan
గూడచారి విభాగాలతో పాటుగా ఇతర పోలీస్ విభాగాలను కూడా కలిపి సమన్వయం చేసే సంస్థ జాతీయ భద్రతా సలహాదారు సంస్థ. మనకు జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ దోవల్ ఉన్నారు. అలాగే ఇతర దేశాలకు కూడా ఒక్కొక్క జాతీయ భద్రత సలహాదారు ఉంటారు. ఎస్ సి ఓ సమావేశాలకు ప్రస్తుతం దానికి అధ్యక్ష బాధ్యతలు మనమే కాబట్టి ఆ ఎస్ సి ఓ లో ఉన్నటువంటి ఇతర  దేశాలకు సంబంధించిన ఇతర జాతీయ భద్రత సలహాదారులతో మీటింగ్ ఇండియాలో, అది కూడా మన ఢిల్లీలోనే జరిగింది.

దానికి అధ్యక్షత వహించడానికి అజిత్ దోవల్ వచ్చారు. ఆయన  పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. చైనా గురించి కూడా అదే తరహాలో కీలకమైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఏదైతే సిపెక్ నిర్మిస్తున్నటువంటిది, మనం ఒక దేశానికి మరొక దేశానికి బంధాలను కలుపుకోవాలి. స్నేహాలను కలుపుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ లింకులు కూడా చేసుకోవాలి.

దాని కోసం, దానికేం అభ్యంతరం లేదు. అలా చేసుకునేటప్పుడు ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి గాని ఆ దేశ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకోకూడదు. వివాదాస్పద ప్రదేశాల్లోకి పోకూడదు. ప్రస్తుతం అలా చేస్తున్నాం. మనలో, మనదేశంలో ఒకటి అంటూ మనలో మనం ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం కరెక్టా అని నిలదీశాడు అజిత్ దోవల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: