మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

Chakravarthi Kalyan
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గౌతమ్ అదానీ అస్తి 50 వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ మండిపడ్డారు. అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారని ప్రకాష్ కారత్ మండిపడ్డారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని ప్రకాష్ కారత్ ప్రశ్నించారు.

ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే ఈడి, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ప్రకాష్ కారత్ విమర్శించారు. లాల్ ప్రసాద్ యాదవ్, కవిత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయని ప్రకాష్ కారత్ దుయ్యబట్టారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన జన చైతన్య యాత్ర ముగింపు సభను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రకాష్ కారత్ నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: