ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఇక చంద్రబాబుదే విజయం?

Chakravarthi Kalyan
నటుడు శివాజీ మరోసారి మెరిశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీభవన్‌లో ఆ పార్టీ నేతలు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు శివాజీ సంఘీభావం ప్రకటించారు. మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి నటుడు శివాజీ దీక్షలో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ కోసం ప్రజలు నిలబడాల్సి ఉందని నటుడు శివాజీ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ విధానాలను ఎవరూ హర్షించరని నటుడు శివాజీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్నినిర్మించిందని.. రాహుల్ కోసం అందరూ ముందుకు రావాలని.. ఇక బై బై మోదీ అంటూ నటుడు శివాజీ వ్యంగాస్త్రాలు సంధించారు.
అలాగే.. ఏపీలో ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని సినీ నటుడు శివాజీ అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బులు పెట్టుకున్నా ప్రజానీకం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించడానికి పూర్తి సిద్ధంగా ఉందని సినీ నటుడు శివాజీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: