జగనన్నా.. మా సంగతి ఏంటన్నా?

Chakravarthi Kalyan
పదోన్నతి పొందిన 3795 గ్రేడ్ -2 VRO లకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లరేషన్ చేయాలని.. ఆంధ్రప్రదేశ్ గ్రేడ్ 2 విఆర్వో సంఘం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ట్ర అధ్యక్షులు, వెంకటరామిరెడ్డి అన్నారు. దాదాపు మాలో 15 సంవత్సరాలు సర్విస్ చేసిన VRAలు ఉన్నారని.. ప్రభుత్వ శాఖలలో ప్రమోషన్ అనేది కచ్చితంగా పే స్కేల్ తో ఇవ్వాలని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.

కానీ జీవో 60. నెం. 13 ప్రకారం VRA లకు గ్రేడ్ -2 VRDలుగా ప్రమోషన్ కల్పిస్తూ, సదరు 60 లో కేవలం 15000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారని.. ఏడాది లోపు CPT ఎగ్జామ్ , సర్వే పరీక్ష పాస్ అయిన వారికి, రెండేళ్లు ప్రొబేషన్ కాలం పూర్తి అయిన తర్వాతే పేస్కేల్ ఇచ్చి రెగ్యులర్ చేస్తాము అని నిబంధనలు పెట్టారని వెంకటరామిరెడ్డి అన్నారు. ఏడాది లోపు నిర్వహించాల్సిన సర్వే ఎగ్జామ్ రెండున్నర సంవత్సరాల తరువాత నిర్వహించారని.. తద్వారా గ్రేడ్ -2 వివరాలకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లరేషన్ కాకుండా అన్యాయం జరిగిందని వెంకటరామిరెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: