చంద్రబాబు భద్రతపై RRR ఆందోళన?

Chakravarthi Kalyan
చంద్రబాబు భద్రత పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధానికి లేఖ రాశారు. జడ్‌ ప్లస్‌ క్యాటగిరి భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి పట్ల అనపర్తిలో పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన రఘురామరాజు.. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా... జరిగిన ఘటనలపై నివేదిక తెప్పించుకోవాలని ప్రధానిని ఆ లేఖలో కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి... త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవాని కోరిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రమాదకరమైన అణచివేత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశపూర్వకంగా, అనాలోచితంగా విచ్ఛిన్నం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని తెలిపారు.
 
ఈ విషయంలో నిర్లక్ష్యం జరిగితే.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరిస్తే... రానున్న కాలంలో ప్రజా తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేఖలో మోదీకి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: