మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే?

Chakravarthi Kalyan
ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని.. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ఐటీ పరిశ్రమలు, సంబంధిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. విశాఖలో  ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయని... తమ ప్రభుత్వం ఏపీ తదుపరి రాజధానిగా విశాఖనే నిర్ణయించిందని ఆర్ధిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖనే ఎంచుకోవడానికి కారణం అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనేనని మంత్రి బుగ్గన తెలిపారు. మరింతగా అభివృద్ధి చెందేందుకూ విశాఖలో అవకాశం ఉందని మంత్రి బుగ్గన  అన్నారు. విశాఖ వాతావరణంతో పాటు పోర్టులు, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టే విశాఖను రాజధానిగా ఎంచుకున్నామని మంత్రి బుగ్గన వివరించారు. కర్నూలు రాజధాని కాదని.. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం అంతేనని.. గుంటూరులోనూ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలన్నది తమ నిర్ణయమని మంత్రి బుగ్గన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: