ఇవాళే హైదరాబాద్‌లో ఈ రేస్‌ స్టార్ట్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ ఇవాళ ప్రాక్టీస్ మ్యాచ్ తో ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా-ఈ రేస్ అంతర్జాతీయ పోటీలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈసారి లుంబిని పార్కు నుంచి రేస్ ప్రారంభమై సచివాలయం పక్క నుంచి.. మింట్ కంపౌండ్ , ఐమాక్స్ మీదుగా, ఎన్టీఆర్ గార్డెన్ వరకు మొత్తం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ను తీర్చిదిద్దారు. ట్రాక్ ను మరింత మెరుగులు దిద్దారు. గతంలో జరిగినా పోరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేసేశారు. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొంటాయి.
ఈ రేసుల్లో 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాటుతారు.  స్ట్రీట్ సర్క్యూట్కు ఇరువైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేసి.. ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లుతోపాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణ పనులు పూర్తి చేశారు. సాయంత్రం 4.30 గంటలకు మొదటి ప్రాక్టీస్ రేస్, రేపు ఉదయం 8.10- 8.40 గంటలకు రెండో ఫ్రీ ప్రాక్టీస్ రేసు, 10.40 - 12.05 గంటలకు క్వాలిఫయింగ్ రేస్ , మధ్యాహ్నం 3.04 గంటలకు ప్రధాన రేసు ఉంటాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన డ్రైవర్లు ట్రాక్ ను పరిశీలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: