అఖండ భారతావనిలోనే తొలిసారిగా లక్ష చండీ మహాయజ్ఞం?

Chakravarthi Kalyan
హర్యానాలో కురుక్షేత్ర వేదికగా ఈనెల 10వ తేదీ నుండి 16 రోజులపాటు లక్ష చండీ మహాయజ్ఞం జరగనుంది. విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో 2160 మంది బ్రాహ్మణోత్తముల భాగస్వామ్యం ఉంటుందని.. 55 ఎకరాల విస్తీర్ణంలో మహా మండపాల నిర్మాణం చేస్తారని.. 110 హోమ గుండాలు ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్‌ వేదికగా ఈనెల 10వ తేదీ నుండి మొదలై 26వ తేదీ వరకు ఈ మహా క్రతువు జరుగుతుంది. గుంతి మాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్ల స్వీయ పర్యవేక్షణ ఉంటుంది. అష్టోత్తర శత కుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేశారు. పూర్వకాలంలో చత్రపతి శివాజీ మహరాజ్‌, పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవని.. శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో ఏకకాలంలో 1760మంది రుత్విక్కులతో ఆరాధన జరుగుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: