తెలంగాణ గుడ్‌న్యూస్‌: మరో 4 రోజులు ఛాన్స్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌ పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 4 దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 3 వ తేదీ వరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరింత పొడిగించింది. నిన్నటితో ముగిసిన గడువును వచ్చే నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్‌ పీఎస్సీ పొడిగించింది. నోటిఫికేషన్ వెలుపడినప్పటి నుంచీ భారీ స్పందన వస్తోందని.. నిన్నటి వరకూ 8 లక్షల 47 వేల 277 మంది దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌ పీఎస్సీ తెలిపింది.

నాలుగు రోజులుగా రోజుకు 30వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని... మొన్న 49వేల 893 మంది.. నిన్న సాయంత్రం 6 వరకు 34 వేల 247 మంది దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌ పీఎస్సీ తెలిపింది. ప్రభుత్వ శాఖల్లో 9వేల జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్ ఉద్యోగాల నియామకానికి టీఎస్‌ పీఎస్సీ గత డిసెంబరు 1న నోటిఫికేషన్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: