గాంధీజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్..!

Chakravarthi Kalyan
ఇవాళ గాంధీ వర్థంతి. గాంధీని గాడ్సే పొట్టనపెట్టుకున్న రోజు.. గాంధీజీ సేవలను లోకం ఇవాళ గుర్తు చేసుకోవడం మన అందరి కర్తవ్యం. కుల, మత, వర్గాలకతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతిపితను స్మరించుకున్నారు.
జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచీలా నిలుస్తారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా..  ఒక్కొక్కటి అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్పూర్తిని గాంధీ జీవితం నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందని సీఎం కేసీఆర్  అన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: