అదానీపై బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందా?

Chakravarthi Kalyan
ఇటీవల స్టాక్‌ మార్కెట్‌ను అదానీ గ్రూపు నష్టాలు భయపెడుతున్నాయి. స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. అదాని గ్రూప్ పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత, ఎల్ఐసీ, ఎస్ బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఈ పరిణామాలపై ప్రతి భారతీయుడికి కేంద్రం సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.



అన్ని సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్, దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరపున మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: