స్నేహమంటే ఇదేరా: బాల్య స్నేహితుడి కుటుంబానికి అండగా..!

Chakravarthi Kalyan
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అన్న విషయాన్ని ఖమ్మం జిల్లా ఏన్కూరు గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి రుజువు చేశారు. ఇటీవల ఆకస్మికంగా మరణించిన తమ మిత్రుడు బింగి  వెంకటేశ్వరరావు కుటుంబానికి 1994 బి. సెక్షన్ బాల్య మిత్రులు ఆసరాగా నిలిచారు. వారి పాప పేరు మీద 80, 000  రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసి అందజేశారు.  
కొంతకాలం క్రితం కొన్ని అనివార్య కారణాలు వల్ల ఆత్మహత్య చేసుకున్న ఏన్కూరు పాఠశాల పూర్వ విద్యార్థి (1994 బ్యాచ్) దివంగత బింగి వెంకటేశ్వరరావు (వేంసూరు మండలం, కందుకూరు గ్రామం.) వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో1994 బ్యాచ్ బి సెక్షన్ విద్యార్థులందరూ (నిక్కర్ మిత్రులు) దయా హృదయంతో స్పందించి, విద్యార్థి దశలో ఉన్న వారి పాప పేరుమీద కొంత నగదును డిపాజిట్ చేయాలనే సంకల్పంతో 80 వేలు రూపాయలు వారి పాప పేరు మీద డిపాజిట్ చేసి, ఫిక్స్ డిపాజిట్ పత్రాలను వారి సతీమణి గారికి ఈరోజు వైరాలో బాల్యమిత్రులు కె.వి అప్పారావు, కిన్నెర ఆనందరావు, ఎస్ శ్రీనివాసరావు, పీవీ సుబ్బారావు, విజయకుమార్, బాల యేసుల సమక్షంలో అందజేశారు.

మా కుటుంబ సభ్యులే మా పిల్లలను పట్టించుకోని సందర్భంలో మా ఆయన గారి మిత్రులైన మీరు అందించిన సహాయం ఎప్పటికీ మరువలేనిది వెంకటేశ్వరరావు సతీమణి అన్నారు. స్నేహితుల కంటే మించిన దైవం లేదని నిరూపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: