కేటీఆర్‌.. పెట్టుబడులతో అదరగొట్టేస్తున్నారుగా?

Chakravarthi Kalyan
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుల సాధనలో దూసుకెళ్తున్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలను తీసుకురావడంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన నేతృత్వంలో ప్రపంచంలోనే అమోజాన్‌ అతి పెద్ద సంస్థ క్యాంపస్‌గా హైదరాబాద్‌ నిలిచింది. ఈ విషయం తనకు గర్వంగా ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఎయిర్‌ టెక్‌ వద్ద ఏర్పాటు చేసిన అమోజాన్‌ ఎయిర్‌ ఇండియాను కూడా మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అమోజాన్‌ ఇండియా వెబ్‌ సర్వీసెస్‌లో 4.4 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది.

ఉత్తర అమెరికా, యూరోప్‌ల తరువాత ఇండియాలో హైదరాబాద్‌ నగరంలో ఎయిర్‌ క్రాప్ట్‌ను ప్రవేశ పెట్టారు. బెంగుళూరులో స్థిరపడ్డ ఈ సంస్థ తన ఆహ్వానం మేరకు హైదరాబాద్‌ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వయస్సులో చిన్నది, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలల్లో అభివృద్ధి వైపు దూసుకుపోతోందని కేటీఆర్ ఖుషీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: