సినీ పండగ: బాలీవుడ్ VS టాలీవుడ్ క్రికెట్‌ మ్యాచ్‌?

Chakravarthi Kalyan
మాదక ద్రవ్యాలను అరికడదామనే పిలుపుతో టాలీవుడ్, బాలీవుడ్ యువనటులు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. వారు ఇందుకు ముందుకు రావడం అభినందనీయం. టాలీవుడ్, బాలీవుడ్ యువనటులు ఆడే క్రిసెంట్ సినీ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఫిబ్రవరి 26న ఎల్బీ స్టేడియంలో జరుగనుంది. సీసీసీ ఛైర్మన్ షకీర్ షఫీ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ మ్యాచ్ కు సంబంధించి ట్రోఫినీ హైదరాబాద్ లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు.

ఈ టాలీవుడ్, బాలీవుడ్ యువనటుల మ్యాచ్ కు సిద్ధమవుతున్న నటులతో మంత్రి తలసాని సే నో టూ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. బాలీవుడ్ జట్టు తరపున అర్బజ్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ నుంచి కెప్టెన్ ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. గాయకుడు రేవంత్, యువ కథానాయకులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, సన్ని, తనీష్, ఖయ్యూం, రవి ప్రకాశ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక మంచి కార్యక్రమం కోసం ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అంతా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: