తెలంగాణ టీచర్లకు కేసీఆర్‌ గుడ్ న్యూస్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో టీచర్లకు సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నామని తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై నిన్న  మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సమీక్ష నిర్వహించినట్టు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేన, అధికారులతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ సమావేశం నిర్వహించారు.

ఈ నెల 27 నుంచి దీనికి సంబందించిన ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. పూర్తి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో తెలంగాణ టీచర్లలో ఆనందం నెలకొంది. ఎన్నాళ్ల నుంచో వారి ఎదురు చూపులకు ఫలితం దక్కబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: