బ్రిటన్ గూఢచారిని ఆ దేశం ఉరి తీసేసిందా?

Chakravarthi Kalyan
బ్రిటన్ గూఢాచారిగా ఇరాన్ మంత్రి పని చేశారా..? అంటే ఇరాన్ మాజీ రక్షణ సహాయ మంత్రి బ్రిటన్ గూఢాచారిగా పనిచేసినట్టు ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ రుజువు అవడంతో ఆయనను జైల్లో బంధించారు. తాజాగా ఆ సహాయ మంత్రిని ఉరి తీసీనట్లు సమాచారం. బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ఎం 16 కి సమాచారం చేరవేస్తున్నారని అనుమానంతో రక్షణశాఖ మాజీ అధికారి అలీ రేజా అక్బరీని ఉరితీసినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్, ఇరాన్ దేశాల ద్వంద పౌరసత్వం కలిగి ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ శంఖానికి సన్నిహితులు. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అరెస్టు చేసినట్లు సమాచారం.



అయితే గతంలోనే అబ్బారీకి మరణశిక్ష విధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తాము వద్దంటున్నా అక్బరికి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్షణ విధించినట్లు అమెరికా, బ్రిటాన్ ప్రభుత్వాలు మండిపడుతున్నాయి. అయితే అక్బారీ మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం బ్రిటన్ దేశానికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. ఇరాన్ కు సంబంధించిన అణు రహస్యాలు, అణు ఒప్పందాలను అమెరికాకు, బ్రిటన్ దేశాలకు అక్బారీ ద్వారానే తెలిశాయి అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. విషయం తెలుసుకున్న ఇరాన్ ప్రభుత్వం ఒక రాయబారిద్వారా పిలిపించి 2019లో అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఉరితీసి ఇప్పుడు ప్రపంచానికి తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

SPY

సంబంధిత వార్తలు: