శరవేగంగా శంషాబాద్ మెట్రో పనుల సన్నాహాలు?

Chakravarthi Kalyan
రాయదుర్గం టు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు మెట్రో పనులు నిర్వహించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ సన్నాహాలు చేస్తున్న మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు వేగవంతం చేయడానికి సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించారని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ పనులు అవి శరవేగంగా సాగుతున్నాయన్న మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ... జనరల్ కన్సల్టెంట్ కోసం బిడ్‌ల సమర్పణకు ఈ నెల 20 చివరి తేదీగా ఉందని తెలిపారు.
నిపుణులైన ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు వచ్చే నెల మొదటి వారంలో నియమితులవుతారని.. ఈలోగా మెట్రో అలైన్‌మెంట్ పక్కాగా సరిదిద్దడంకి, స్టేషన్ల స్థానాలు నిర్ణయించడానికి సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి  వివరించారు. శాటిలైట్ ఆధారిత డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అనే రెండు పద్ధతులు ఉపయోగిస్తున్నామని... ఖచ్చితమైన కోఆర్డినేట్‌లను తెలుసుకోవడం కోసం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల సాయంతో సర్వే పని జోరుగా జరుగుతోందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్ గ్రాండ్ అండర్‌పాస్ వరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయిందని.. ఈ నెలాఖరులోగా మొత్తం సర్వే పూర్తి కానుందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత అలైన్మెంట్ ను తెలియజేసేలా పెగ్ మార్కింగ్ ప్రారంభిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: