తెలంగాణ కొత్త సీఎస్‌.. ఆయనవైపే కేసీఆర్‌ మొగ్గు?

Chakravarthi Kalyan
 హైకోర్టు తీర్పు కారణంగా తెలంగాణ సీఎస్‌ సోమేశ్ కుమార్ రిలీవింగ్ నేపథ్యంలో తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరన్న అంశం ఉత్కంఠగా మారింది. డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్ కుమార్ ను విధుల నుంచి రిలీవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త సీఎస్ ను నియమించాల్సి ఉంది. రాష్ట్ర కేడర్ లో  ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధామిశ్రా, రాణి కుమిదిని, శాంతికుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, అశోక్ కుమార్, అర్వింద్ కుమార్ ఉన్నారు.
వీరందరిలోనూ రామకృష్ణారావు ఒక్కరే తెలంగాణ స్థానికత కలిగిన అధికారి. రామకృష్ణారావు 2025 ఆగస్టు వరకు, అర్వింద్ కుమార్ 2026 ఫిబ్రవరి వరకు పదవిలో ఉంటారు. రామకృష్ణారావు, అర్వింద్ కుమార్ పేర్లు సీఎస్ రేసులో బలంగా ఉన్నాయి. రజత్ కుమార్, సునీల్ శర్మ, శాంతి కుమారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: