టాటా ది గ్రేట్‌: ఇండియాలోనే ఐఫోన్‌ తయారీ?

Chakravarthi Kalyan
ఐఫోన్ తయారీలో సరికొత్త చరిత్రకు టాటా సంస్థ నాంది పలకబోతోంది. భారత్‌ లో దేశీయంగా ఐఫోన్ తయారీకి టాటా సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విస్ట్రోన్‌తో టాటా సంస్థ ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. విస్ట్రోన్‌ కేంద్రంలో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు టాటా సంస్థ యత్నిస్తోంది. విస్ట్రోన్‌ సాయంతో తయారీ కార్యకలాపాలను పొందేందుకు టాటా సంస్థ యోచిస్తోంది.

మార్చి 31 నాటికి టాటా-విస్ట్రోన్ చర్చలు కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే ఐఫోన్ల తయారీని టాటా సంస్థ చేపట్టే అవకాశం ఉంటుంది. ఇదే సాకారమైతే.. ఐఫోన్‌ తయారీలో భారత్‌ సరికొత్త చరిత్రకు నాంది పలకినట్టు అవుతుంది. ఇప్పటికే  భారత్‌లో ఐఫోన్లు తయారవుతున్నప్పటికీ.. వాటిని విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌, విస్ట్రోన్‌, పెగాట్రాన్‌ కంపెనీలు దేశీయంగా తయారీ కేంద్రాలను నెలకొల్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: