చైనాలో ఇండియా మందులకు ఫుల్‌ గిరాకీ?

Chakravarthi Kalyan
చైనాలో కొవిడ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడ భారతీయ జెనరిక్‌ ఔషధాలకు గిరాకీ బాగా పెరిగిందట. ప్రధానంగా కొవిడ్‌-19 చికిత్సలో వినియోగిస్తున్న ఫైజర్‌కు చెందిన పాక్స్‌లోవిడ్‌ ఔషధాన్ని చైనాలో బాగా కొంటున్నారట. అయితే దీన్ని ప్రాథమిక వైద్య బీమా ఔషధాల జాబితాలో చైనాకు చెందిన నేషనల్‌ హెల్త్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ చేర్చలేదని తెలుస్తోంది. ఆ కంపెనీ కొటేషన్‌ అధికంగా ఉండటంతోనే దాన్ని జాబితాలో చేర్చలేదంటున్నారు.

అయితే..  పాక్స్‌లోవిడ్‌ సరఫరా కొరతతో చైనాకు చెందిన ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో ఈ ఇండియన్ జెనరిక్‌ వెర్షన్లకు గిరాకీ బాగా పెరిగింది. ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కనీసం 4 జెనరిక్‌ కొవిడ్‌ ఔషధాలను ఇటీవలి వారాల్లో అక్కడి ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో ఉంచారు. పాక్స్‌లోవిడ్‌ జెనరిక్‌ వెర్షన్లు ప్రిమోవిర్‌, పాక్సిస్టా, మోల్నుపిరవిర్‌ జెనరిక్‌ వెర్షన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ  ఔషధాలకు ఇండియాలో అత్యవసర వినియోగానికి అధికారులు అనుమతించారు. అయితే. చైనాలో వీటి వినియోగం చట్టబద్ధం కాదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: