సంక్రాంతి: ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు.. ఎక్కడెక్కడికంటే ?

Chakravarthi Kalyan
సంక్రాంతి సందర్బంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ప్రత్యేక బస్సులకు ఎటువంటి అధనపు చార్జీలను వసూలు చేయడంలేదు. సాధారణ చార్జీలనే తీసుకుంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2,720 బస్సులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,356 బస్సులను, కర్ణాటక రాష్ట్రానికి 101 బస్సులను, మహారాష్ట్రకు 56 బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపిస్తోంది.

ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని టీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. జేబీఎస్ నుంచి 1,184 బస్సులను, ఎల్.బీ.నగర్ నుంచి 1,133 బస్సులను, ఆరాంఘర్ నుంచి 814 బస్సులను, ఉప్పల్ నుంచి 683 బస్సులను, కేపీహెచ్.పీ నుంచి 419 బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపిస్తోంది. 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులు www.tsrtconline.in వెబ్ సైట్ లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.  జనవరి 31 లోపు తిరుగు ప్రయాణం చేసే వారికి 10శాతం ప్రయాణ చార్జీల్లో రాయితీ కూడా కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: