చంద్రబాబు హెరిటేజ్‌.. రైతులను దోచుకుంటోందా?

Chakravarthi Kalyan
చంద్రబాబుకు హెరిటేజ్‌ పాల సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. చిత్తూరు జిల్లాలో ఈ సంస్థ రైతులకు తక్కువ ధర ఇస్తూ మోసం చేస్తోందంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సదుం, సోమల మండలాల్లో చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ రైతులకు చెల్లించేది తమ సంస్థకంటే తక్కువ ధర అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. తమ శివశక్తి డెయిరీ మొత్తం 347 సెంటర్లలో పాలను సేకరిస్తోందంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏ ఒక్క ప్రాంతంలో అయినా రూ.29 కంటే తక్కువ ధర చెల్లిస్తే నిరూపించాలని సవాల్‌ విసిరారు.

తమ సంస్థ పాలలో వెన్న శాతం ఆధారంగా లీటర్‌కు రూ.29 నుంచి రూ.33 పాడి రైతులకు చెల్లిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. దీంతోపాటు అదనంగా ఇన్సెంటివ్‌ కూడా ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. హెరిటేజ్‌ మాత్రం లీటరుకు రూ.24 నుంచి రూ.29 మాత్రమే చెల్లిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 10 లీటర్ల పాలు తీసుకుని పుంగనూరులోని సదుం, సోమలలో పర్యటించాలని... 5 లీటర్లు శివశక్తి డెయిరీకి, మరో 5 లీటర్లు హెరిటేజ్‌కు ఇవ్వు. ఎవరు ఎంత ధర చెల్లిస్తారో ప్రత్యక్షంగా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: