కాంగ్రెస్ సిత్రాలు: ఏపీకి ఉత్తమ్‌.. పాండికి వీహెచ్‌?

Chakravarthi Kalyan
కాంగ్రెస్‌ పార్టీ జనవరి 26వ తేదీ నుంచి "హాత్‌ సే హాత్‌'' జోడో అభియాన్‌ పాదయాత్ర ప్రారంబిస్తోంది. దీని నిర్వహణకు 26 రాష్ట్రాలకు ప్రత్యేకంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజక వర్గ, బ్లాక్‌, మండల స్థాయిలో జూన్‌ చివర వరకు నిర్వహించాల్సిన ఈ పాద యాత్ర సజావుగా కొనసాగేందుకు పరిశీలకులను నియమించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, మాజీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌లను మహారాష్ట్ర, గోవాలకు పరిశీలకులుగా నియమించారు.

ఇక తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ పీసీసీలు వి.హనుమంతురావు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలను పాండిచ్ఛేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పరిశీలకులుగా నియమించారు. తెలంగాణ రాష్ట్రానికి గోవా మాజీ పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ నియామించారు. వీరు ఆయా రాష్ట్రాలల్లో జరిగే పాదయాత్రలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదించాలి. నాయకుల మధ్య సఖ్యత లేనట్లయితే...సమన్వయం చేసి సక్రమంగా కొనసాగేట్లు చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: