ఇక కేసీఆర్‌తో చంద్రబాబు చెడుగుడు ఆడుకుంటారా?

Chakravarthi Kalyan
తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఇటీవల చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మొన్నటి ఖమ్మం సభలో ఇదే చెప్పారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి కారణంగానే అంటూ  పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని జగ్గారెడ్డి మండిపడ్డారు. రాజకీయ బతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారని జగ్గారెడ్డి దుయ్యబట్టారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని జగ్గారెడ్డి అన్నారు.

ఇక చంద్రబాబు కేసీఆర్‌తో ఆడుకుంటారని జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్ ఏపీకి వెళుతున్నారు కాబట్టి చంద్రబాబు తెలంగాణకు వచ్చారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. సైలెంట్‌గా  ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి రావడానికి కేసీఆర్ అవకాశం కల్పించారని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్‌ చేయలేరని...బాబు మాత్రం తెలంగాణను అట్రాక్ట్ చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు. ఇకపై తెలంగాణలో సీరియస్ రాజకీయాలు నడుస్తాయని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక మైనార్టీలకు రుణాలివ్వడంలేదన్న జగ్గారెడ్డి...ఇప్పుడు కేటాయించిన 120కోట్లు సరిపోవని కనీసం 1500కోట్లు పెంచాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: