హైదరాబాద్ శివార్లు.. పెరుగుతున్న నేరాలు?

Chakravarthi Kalyan
రాచకొండ పోలీసు కమిషనేట్‌ పరిధిలో గతేడాదితో పోల్చితే 19శాతం నేరాలు పెరిగాయని పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపారు. ఇందులో ఎక్కువ శాతం సైబర్‌ నేరాలు, మత్తు పదార్థాల రవాణాకు సంబంధించిన ఉన్నాయని పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ అన్నారు. మిగతా నేరాల్లో కొంత తగ్గుదల నమోదయిందని పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ వివరించారు. రాచకొండ కమిషనరేట్‌ వార్షిక నేర నివేదకను సీపీ మహేష్ భగవత్ విడుదల చేశారు.
దృష్టి మరల్చి చేసే దోపిడీ 11.57శాతం, 131శాతం గుట్కా రవాణా కేసులు, 0.91 రహదారి ప్రమాద మరణాలు, బాహ్యవలయ రహదారి మరణాలు 31శాతం, 1.3 శాతం అత్యాచార కేసులు, 5శాతం వరకట్న హత్య కేసులు తగ్గినట్లు పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ వివరించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాల్లో 29శాంత హత్యలు, 38శాతం అపహరణలు కేసులున్నాయని పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ పేర్కొన్నారు. పెరిగిన నేరాల్లో 66శాతం సైబర్ నేరాలు, 19శాతం రహదారి ప్రమాదాలు, 17శాతం గేమింగ్ యాక్ట్ కేసులు, 140శాతం పెరిగిన మత్తు పదార్థాల కేసులు, 17శాతం మహిళలపై నేరాలున్నాయని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: