బీఆర్‌ఎస్‌ కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌ ఇదే ?

Chakravarthi Kalyan
దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న కేసీఆర్.. క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు ఉధృతం చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్స్‌ ప్రారంభానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ముందుగా డిసెంబర్ చివరికల్లా 6 రాష్ట్రాల్లో కిసాన్‌సెల్‌ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ముందుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల్లో బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్స్ ఏర్పాటు చేస్తారు.
అంతే కాదు.. తెలంగాణ ఉద్యమం తరహాలో బీఆర్‌ఎస్‌ విస్తరణ కోసం సాహిత్యాన్ని విరివిగా వాడుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ భావజాల వ్యాప్తికి పలు భాషల్లో సాహిత్యం సిద్ధం చేస్తున్నారు. కన్నడ, మరాఠా, ఒడిశా సహా పలు భాషల్లో సాహిత్యం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ పలు భాషల సాహిత్యకారులకు సూచనలిస్తూ పాటలు రాయిస్తున్నారు. అలాగే ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి చేరికలకు సంప్రదింపులు జరుపుతున్నారు. డిసెంబర్ నెలాఖరులో దిల్లీలో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి భారత్‌ రాష్ట్ర సమితి విధివిధానాలు ప్రకటించాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: