దొంగల ముఠాతో జట్టు కట్టిన పోలీస్‌.. ఏం చేశాడంటే?

Chakravarthi Kalyan
పోలీసంటే దొంగలకు హడల్.. దొంగలు కనిపిస్తే పోలీస్‌ వేటాడతాడు.. ఇది రొటీన్.. ఓ పోలీస్ మాత్రం దొంగలతోనే చేతులు కలిపాడు.. దొంగల ముఠాలతో జతకట్టి పలు చోరీలు చేయించాడు. ఆయనే కానిస్టేబుల్‌ ఈశ్వర్‌.. ఈ మొనగాడు.. దొంగలతో సెల్‌ఫోన్లు, బంగారు గొలుసు చోరీలు చేయించాడు. అలా నేరస్థులతో చోరీలు చేయించి భారీగా ఆస్తులు కూడబెట్టాడు.
ఈ ఈశ్వర్‌ను గతంలో ఓ కేసులో నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈశ్వర్‌కు సహకరించిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్లపైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌స్పెక్టర్లు వై.అజయ్‌, టి.శ్రీనాథ్‌రెడ్డి, సాయివెంకట కిషోర్‌పై చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ను సర్వీస్‌ నుంచి తొలగించినట్టు సీపీ సి.వి. ఆనంద్‌ తెలిపారు. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ సర్వీసు నుంచి తొలగించారు. పోలీసుల్లో ఇలాంటి పోలీసులు కూడా ఉంటారా అని ఈశ్వర్ సంగతి తెలిసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: