మోదీ అంటే ద్వేషం.. రాహుల్ అంటే ప్రేమ ?

Chakravarthi Kalyan
మోదీ ప్రభుత్వం ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొడుతుంటే.. రాహుల్‌ చేస్తున్న జోడో యాత్ర ప్రజల మధ్య ప్రేమానురాగాలు పెంచే విధంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ రాష్ర్ట మీడియా ఛైర్మన్‌ తులసి రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదు, పోలవరం పూర్తి కాదని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో చెప్పడం దుర్మార్గమని ఆయన తులసి రెడ్డి ప్రత్యేక హోదా అనేది రాష్ర్టానికి సంజీవని తులసి రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్రప్రభుత్వం 90 శాతం, రాష్ర్టం పది శాతం భరించాల్సి నిధులు భరించాల్సి వస్తుందన్నారు.
చాలా వాటిల్లో రాయితీలు వస్తాయని, దీంతో పలువురు పరిశ్రమలు పెట్టడం వల్ల ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని తులసి రెడ్డి  అన్నారు. పోలవరం అనేది ప్రకృతి ప్రసాదించిన వరమన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఎనిమిదేళ్ల నుంచి భాజపా అధికారంలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: