పీకల్లోతు కష్టాల్లో రేవంత్‌ రెడ్డి?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం నెలకొంది. పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. తెలుగుదేశం నుంచి వచ్చిన నేతలు ఒక వర్గంగా.. సీనియర్లు మరో వర్గంగా చీలిపోయారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పీసీసీ కమిటీలో.. పలు విభాగాల్లో పోస్టింగులు వచ్చాయని సీనియర్లు విమర్శలు గుప్పించారు. దీనికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే సీతక్క సహా 13 మంది నేతలు పీసీసీ పదవులకు రాజీనామా చేశారు.

మరోవైపు రేవంత్ రెడ్డి పరిస్థితి అధ్వానంగా మారింది. సీనియర్లు ఎవరూ సహకరించట్లేదు. ఆయన చేపట్టే ఏ కార్యక్రమంలోనూ సీనియర్లు పాల్గొనట్లేదు. రేవంత్ చేయబోయే పాదయాత్రకు కూడా సహకరించట్లేదు. రోజురోజుకు రేవంత్ పై వ్యతిరేకత తీవ్రం అవుతుంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతుంది. ఈ టైంలో మరి ఈ విబేధాలు చల్లార్చేందుకు అధిష్ఠానం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. కాంగ్రెస్ ను ఐక్యంగా మార్చేందుకు అధిష్ఠానమే దిగవస్తుందో.. లేదా హైకమాండ్ దూతగా ఎవరైనా వస్తారో తెలియాల్సి ఉంది. కొన్ని సీట్లు గెలవాలన్నా.. కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా ఉంటేనే సాధ్యమయ్యేలా కన్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: