అక్కడ కూడా జగన్‌ ఫోటోనా.. అవసరమా?

Chakravarthi Kalyan
జగనన్న శాశ్వత భూ సర్వే పేరుతో ప్రభుత్వం ఇస్తున్న  పాస్ పుస్తకాల్లో ముఖ్యమంత్రి జగన్ ఫోటో వేసుకోవడం వివాదాస్పదం అవుతుంది. ప్రజల ఆస్తుల పత్రాలపై నేతల ఫోటోలు ఎందుకని విపక్షాలు ఆరోపిస్తునత్నాయి. పాస్‌ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. తాత ముత్తాతల నుంచి సంక్రమిస్తున్న భూమి పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ప్రశ్నించారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు మానుకోవాలని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  సూచించారు.

కాల్వల్లో పూడిక తియ్యలేరు కానీ పొలాల పాస్ పుస్తకాల్లో మాత్రం జగన్ ఫోటో ఏమిటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ప్రశ్నించారు.  రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన డబ్బు రైతులకు ఇచ్చి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్   వ్యాఖ్యానించారు. తెనాలి నియోజకవర్గంలో 7లక్ష 75వేల క్వింటాళ్లు వరి పండిస్తే ప్రభుత్వం కేవలం 900క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందని మనోహర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: