ఏపీలో ఆ జిల్లాల్లో తక్కువ తాగుతున్నారట?

Chakravarthi Kalyan
ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. సీఎం జగన్ దశల వారీ మద్య నిషేధం అని చెబుతున్నా.. అది ఎలా అమలుచేస్తారో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక ఏపీలో మద్యం విక్రయాల్లో విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, కడప జిల్లాలు ఏప్రిల్ -నవంబర్ మధ్య తక్కు రెవెన్యూ నమోదు చేశాయట. ఈ విషయాన్ని అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి స్పష్టం చేశారు. వచ్చే నాలుగు నెలల్లో ఈ జిల్లాలు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన టార్గెట్ ఫిక్స్ చేశారు.

మద్యం  ఆదాయన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలని అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి ఆదేశించారు. మరోవైపు మద్యపాన నియంత్రణ దిశగా కఠినంగా వ్యవహరించాలని అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి  సూచించడం విశేషం. అక్రమ మద్య రవాణాపై ఉక్కుపాదం మోపటంతో పాటు తయారీదారులకు ప్రత్నామ్నాయ ఉపాధి కల్పించేలా పరివర్తన పథకాన్ని అమలు చేయాలని అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి  సూచించారు. ఏపీ బెవరేజ్ కార్పోరేషన్ నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో అక్రమాలు సహించబోమని మంత్రి తేల్చి చెప్పారు. మాదకద్రవ్యాలు, గంజాయి రవాణాపై మరింత కఠినంగా వ్యవహరించాలని అబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి ఆదేశాలిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: