ఆ పథకాలతో జగన్‌.. మహిళల జీవితాలు మార్చేశారా?

Chakravarthi Kalyan
ఏపీ రాష్ర్టంలో కోటి 14 వేల మంది మహిళలు 11.12లక్షల డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు 20వేల నుంచి 30వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు. 2019నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు 97వేల 724 కోట్ల రూపాయలు రుణాలు అందజేశారు.
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ వంటి పథకాలు మహిళల అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇంతియాజ్ అంటున్నారు. మహిళా ఆర్థిక, సామాజిక స్వవలంబనకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఇంతియాజ్ అన్నారు. డ్వాక్రా సంఘాలు వందకి 99.50శాతం రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు ఇంతియాజ్ పేర్కొన్నారు. అర్హత ఉండి పథకాలు అందని వారు తిరిగి అప్లై చేసుకొని లబ్ధి పొందవచ్చని ఇంతియాజ్ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: