గర్జనకు చంద్రబాబు రెడీ..మరి జగన్‌ సంగతేంటి?

Chakravarthi Kalyan
ఈనెల 22 నుంచి ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించనున్నారు. విశాఖ గర్జన, రాయలసీమ గర్జన అని జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి పలు పార్టీలు. బొబ్బిలి, రాజాంలో రాత్రి బసకు కూడా సిద్ధమయ్యారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉత్తరాంధ్రలో బాబు పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలోనూ ఉనికి చాటుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ పర్యటనతోనైనా.. తెలుగు దేశం పార్టీకి ఆదరణ దక్కుతుందో లేదో చూడాలి.

కరోనా వల్ల జనాల్లోకి వెళ్లడాన్ని చంద్రబాబు బాగా తగ్గించారు. అన్నీ వర్చువల్ పద్ధతిలోనే కానిచ్చేశారు. లాస్ట్ కు నిరసనలు కూడా డిజిటల్ గానే తెలిపారు. కాగా.. ఎన్నికల ముందుండగా ఇలా ఉత్తరాంధ్ర పర్యటనతో ఓటు బ్యాంకుని పెంచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు. ఒకవేళ ఈ పర్యటన కనుక విజయవంతం అయితే మరిన్ని సభలు నిర్వహించేందుకు తెలుగు దేశం పార్టీ ఉత్సాహం చూపించే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: