దేశంలో బంగారం స్మగ్లింగ్‌.. ఏ రేంజ్‌లో అంటే..?

Chakravarthi Kalyan
బంగారంపై భారతీయులకు ఎంత మమకారం ఉందో తెలిసిందే. అందుకే కాస్త తక్కువ ధరకు బంగారం ఎలా వచ్చినా తీసుకుందామనుకుంటారు. ఆ ఆశే స్మగ్లింగ్‌కు అవకాశం ఇస్తోంది. ఈ ఏడాదిలో నవంబర్  నెల వరకు వివిధ కేసుల్లో 3వేల 83 కిలోల బంగారాన్ని ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. మెుత్తం 3వేల 588 కేసుల్లో ఈ బంగారాన్ని జప్తు చేసింది.  ఇందులో అత్యధికంగా కేరళలో 690 కిలోల పసిడిని పట్టుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో 474 కిలోలతో మహారాష్ట్ర, 440 కిలోలతో తమిళనాడు, 369 కిలోలతో పశ్చిమ బెంగాల్  ఉన్నాయి.

ఇక 2021లో 2వేల383 కిలోలు ఈడీ పట్టుకుంది. 2020లో 2వేల154 కిలోలు, 2019లో 3వేల 673 కిలోల బంగారాన్ని ఈడీ పట్టుకుంది. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. గత 3 ఏళ్లలో 3 కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు నమోదు చేసింది. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డైరెక్టరేట్  ఆఫ్  రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: