కంట నీరు కాదు.. నిప్పులు.. కవిత వార్నింగ్‌?

Chakravarthi Kalyan
సీబీఐ విచారణ పేరిట తనను ఇబ్బంది పెట్టడంపై బీఆర్ఎస్ నేత కవిత మండిపడ్డారు. తన ఒక్కదాని పైనే కాదు.. దేశవ్యాప్తంగా ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయని.. వీటిని పట్టించుకోనని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. తెలంగాణ ఆడపిల్లల కంట నీరు రాదు.. నిప్పులు వస్తాయ్ అని బీఆర్ఎస్ నేత కవిత హెచ్చరించారు. వెనక్కి తగ్గేది లేదు.. ముందుకే వెళ్ళాలన్న బీఆర్ఎస్ నేత కవిత.. ఏడాదిన్నరలో మన సత్తా ఏంటో చూపాలన్నారు.

దేశవ్యాప్తగా పలు అంశాలపై జాగృతం చేయాల్సి ఉందన్న  బీఆర్ఎస్ నేత కవిత.. త్వరలో సమావేశమై జాగృతి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేద్దామన్నారు. యువత దేశం గురించి ఆలోచించాలని.. దేశంలో మేధావులు, కవులు, రచయితలు అసంతృప్తిగా ఉన్నారని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. విపక్షంపై దాడి జరిగితే చివరికి నష్ట పోయేది ప్రజలేనని.. దేశవ్యాప్తంగా మేధావులు, కార్మికులు, కళాకారులను ఏకం చేద్దామని  బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. ఏజెన్సీల దాడులు జమ్మూ నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: