తీవ్ర తుపానుగా మాండౌస్‌.. ప్రభావం ఎంతగా ఉందంటే ?

Chakravarthi Kalyan
మాండౌస్‌ తుపాను ఏపీ రైతులను వణికిస్తోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం చూపుతోంది. నెల్లూరు, బాపట్ల, తిరుపతి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ముసురు ప్రభావం నెలకొంది. నిన్న రాష్ట్రంలో చాలా చోట్ల చలిగాలులు వణికించాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో..... వర్షాలు ఇప్పటికే కురుస్తున్నాయి.

మాండౌస్‌ తుపాను  ప్రభావం ఆంధ్రప్రదేశ్  రైతుల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే రైతులు  వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఇప్పుడు ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షాల కారణంగా ధాన్యం పాడవుతుందని దిగులు చెందుతున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పత్తి తడిసిపోతుందేమోనని పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మందేవంలో అత్యధికంగా 125.75మిల్లి మీటర్ల వర్షపాతం రికార్డయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: