జీతాలో జగనన్నా.. ఉద్యోగుల కేకలు?

Chakravarthi Kalyan
ఏపీలో 9 తారీకు వచ్చినా వచ్చినా ఇప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని... ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు వెయ్యి కోట్లు, పెన్షన్లు 8 వందల కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 2 వందల కోట్లు ఈనెలలో ఇంత వరకు చెల్లించలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేదని... ప్రతి నెలా ఏ రోజున జీతాలు చెల్లిస్తారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
2018 జూలై నుంచి తమకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. సీపీఎస్ ను ఐదు రాష్ట్రాలు రద్దు చేశాయని... మన ప్రభుత్వం ఎందుకు చేయదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి మహాసభలు కర్నూలులో నిర్వహించనున్నట్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: